వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా, పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 31 మంది సెక్టార్ అధికారులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 3క్విక్ రెస్పాన్స్ అధికారులను, 3 ఈవీయం ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణవేణి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు చేశామని, ఈవిఎం యంత్రాల తరలింపు ఏర్పాట్లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈవిఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు.
Warangal
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈసారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానని వేడుకున్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also..
Read Also..
జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర రమణా రెడ్డికి నిరసన సెగ తగిలింది..జయశంకర్ భూపాలపల్లి జిల్లా , రేగొండ మండలం, చిన్న కోడెపాక గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ ఓ మహిళ నిరుద్యోగి గండ్ర రమణా రెడ్డిని నిలదీసింది.. దీంతో నో ఆర్గ్యూమెంట్ అంటూ గండ్ర రమణా రెడ్డి అక్కడ నుంచి జారుకున్నారు .
వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ అనుచరుల దౌర్జన్యం. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సదానందం పై దాడి. దాడిలో గాయపడిన సదానందంను ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కనుసన్నల్లో వీరంగం. రాత్రి పూట కార్లల్లో తిరుగుతూ, బీఆర్ఎస్ అభ్యర్థి నానా హంగామా చేస్తున్నట్లు సమాచారం. పోచమ్మ మైదాన్ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు మూడు గంటలకు ఘటన. రోడ్డు మీద వెళ్తున్న కారుకు అడ్డుగా మరో కారును ముందు పెట్టి హల్ చల్. ఆ కారులోని సదానందం అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై దౌర్జన్యం, దాడి. సదానందం కారులో డబ్బులు ఉన్నాయంటూ చెక్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి “నన్నపునేని నరేందర్” అనుచరులు చివరికి డబ్బులు లేవు ఏమి లేవు అని తెలిసి వెళ్ళిపోయిన వైనం. సమాచారం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ సీఐ పోలీస్ వాహనంలో నుండి ఓ రౌడీ షీటర్ బయటకు దిగి, పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుడు సదానందం పైన దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ వాహనంలో సదరు రౌడీ షిటర్ ఎందుకు వచ్చినట్టు..? పోలీస్ వాహనంలో ఆ వ్యక్తి ఎందుకు ఉన్నట్లు..? దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటానికి కారణం ఏంటి..? దాడికి పాల్పడిన వారిపైన కేసు నమోదు చేయాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ.100 స్టాంప్ పేపర్‌పై సంతకం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నేను కచ్చితంగా నెరవేరుస్తా అన్నారు. మన నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా అంకితమవుతానని భట్టి తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతాను అని భట్టి విక్రమార్క అఫిడవిట్లో పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత, జాటోత్ హుస్సేన్ నాయక్ ల ను గెలిపించాలని ప్రజలకు సూచించారు. కాగా ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం నెలకొన్నది.
ప్రధాని మోదికి డోర్నకల్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిని భూక్యా సంగీత గిరిజన సాంప్రదాయ ఆభరణాలను అందించారు. తదుపరి ప్రధాని కాళ్లకు సంగీత నమస్కరించారు. ఇది సాధారణంగా ప్రతి వేదికలపై జరిగే విషయమే కానీ దేశ అత్యున్నత స్థానమైన ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ అతి సాధారణ మారుమూల గిరిజన తండాలో పుట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిని పాదాలకు తిరిగి నమస్కరించారు. కాగా ఈ సన్నివేశం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ప్రథమ పౌరుడైన మహిళల పట్ల ఇచ్చే అత్యున్నత గౌరవం భాజపాకు మాత్రమే సాధ్యమవుతుందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
Read Also
బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది’ అన్నారు. నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట.. ‘నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్ టైమ్ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగుతాయ్. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఆన్లైన్ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది. కరోనా కాలంలో ఆన్లైన్లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు ఇంటర్ నెట్ లో పార్ట్ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్‌ను ఆశ్రయించడం ఎక్కువైంది. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా యువత ఆన్ గేమింగ్ వైపు మళ్లి బలయిపోయారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆన్లైన్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి సుమారు రూ. 2 లక్షలు పోగొట్టుకున్న విద్యార్ధి ప్రశాంత్. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also..
Read Also..
బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ మాట్లాడారు. ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తానన్నారు. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని ధీమా వ్యక్తం చేశారు. నాకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందని, తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానన్నారు.ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని అన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని… వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు.
బీజేపీ తోపాటు జనసేన పార్టీ సేవలు అవసరం అనిపిస్తుంది. బీసీ బిడ్డను సీఎం గా చూడాలని బీజేపీ కోరుతున్న అజెండాలో నేను కూడా ఒక్కడిని. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మణించింది. తెలంగాణలో కనీసం త్రాగు నీళ్లు లేని తండాలను గతంలో నేను గుర్తించా. అదిలాబాద్ జిల్లా ఓ తండాలో నేను భోరు బావి వేయించా. వరంగల్ తూర్పు, పశ్చిన అభ్యర్ధులను ఖచ్చితంగా గెలిపించుకుంటాం.. ఇక నుండి మీ కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటా. అవినీతి రహిత తెలంగాణను నేను కోరుకుంటున్నా. గద్దర్ తో కలిసి సామాజిక తెలంగాణ సాధించాలనుకున్నా. మోడి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిగా హామి ఇచ్చారు. ఇప్పటికే ముప్పై ఒక్క మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా నియమించారు. గద్దర్ మరియు నా ఆశయాలు నెరవేరే క్షణం ఇప్పుడు సాకారం అవ్వబోతుంది. బీజేపి అధికారంలోకి రాగానే ఓరుగల్లు భద్రకాళి వారికి మొక్కులు తీర్చుకుంటా. తెలంగాణ నా గుండె చప్పుడు…ఆ మాట వింటే చాలు నా రోమాలు నిలుచుంటాయి. రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్న నేను తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాను. నాకు దన బలం లేకున్నా గుండె బలం వచ్చింది తెలంగాణ ఉద్యమ ఘటనలే… పదె పదె గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్…నాకు ఇష్టమైన నాయకుడు భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోది…తెలంగాణ సాధనలో భవిష్యత్తు కోసం 1200 అమరులయ్యారో వారి సాక్షిగా భవిష్యత్తు కోసం జనసేనా కొనసాగిస్తుంది.




Total views : 151884