ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమించాలని, తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని, UAPA కేసులను రద్దు చేసి NIA దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని సీపీఐ (మావోయిస్టు)పై, అనుబంధ ప్రజాసంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండని “ప్రజా పాలన” కార్యక్రమంలో- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించిందని, పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల, పేదరైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాలను కకలావికలం చేశారు. కాళేశ్వరం దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతటా ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కు అన్ని వేల కోట్ల ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీద కుటుంబం పొందిన పర్సెంటేజీల వివరాలను బయటపెట్టాలన్నారు. అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్నారు.
Warangal
మంత్రులుగా తాను సీతక్క ఇద్దరం రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏమో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరల నిర్వహణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ సురేఖ. స్వామివారి దర్శనానికి వచ్చిన సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
జనగామకు చెందిన హరిబాబు పిట్టలు కొట్టి తింటుంటాడు. జనగామ సమీపంలో గులేరుతో పిట్టలు కొట్టడానికి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ అద్దంకి తగిలి అద్దం పగిలింది. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఇందులో తన తప్పేమీ లేదని వదిలేయండి అని పోలీసులతో మొరపెట్టుకున్నాడు.
Read Also..
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. ఇలాంటి జాతరకి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు, ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి. ఈరోజు వరంగల్ నుండి బిజేపి పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరకి స్టేటస్ ఇవ్వాలని, ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతరకు 100 కోట్లు ఇచ్చాము. బస్సు ఫ్రీ అయినప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు, స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి. ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి, ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు, రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం. ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా. 2000 పెన్షన్ వచ్చే వారికి 4000 పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు, కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు, యువకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయాలలో అయోమయం లో ఉన్నారు. ప్రజలను కష్ట పెట్టడం తప్ప, ఈ పధకాలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, మీ సేవ లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి.
వరంగల్, అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ లను కొందరు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇలా జరుగుతుంది. పట్టించుకునే వారు లేకపోవడంత పేద ప్రజలు తప్పదని కొంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టారు.
హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా నోడల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ శ్రీమన్, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసాం. అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వస్తుంది అని అన్నారు.
వరంగల్, హన్మకొండ కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సితక్క, కొండా సురేఖ ప్రజా పాలన పై సమీక్ష సమావేశం. హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు,వరంగల్ సీపీ, ఎస్పీ లు. ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ. దరఖాస్తుదారునికి రూపాయి ఖర్చు కాకుండా చర్యలు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి దరఖాస్తుదారునికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలి. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారుల ది ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ పోక్సో కేసులు 36 శాతం పెరిగితే, మహిళలపై 18 శాతం నేరాలు పెరిగాయని సీపీ తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 కోట్ల విలువైన వస్తువులు, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 18 మందిపై పీడీ యాక్ట్లు నమోదు చేశామన్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఏడాది 1167 మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 90 శాతం చేధించామన్నారు. వరంగల్ నగరంలో సీసీ టీవీ కెమెరాలు పెంచుతామన్నారు. మహిళలపై నేరాలను, సైబర్ క్రైమ్ను అరికడుతామన్నారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చిట్ ఫండ్స్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడ్డవారికి న్యాయం చేస్తామన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంకా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతామని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. గతంలో ఈ ఆలయానికి నాలుగుసార్లు వచ్చానని తెలిపారు. ఎన్నికల తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పానని, అందువల్లనే వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నానని తెలిపారు. ఆలయంలో ఇంకుడు సమస్య ఉందని పూజారులు తెలిపారని, తప్పకుండా నాగేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పస్వామి భక్తులు కేరళకు వెళ్తారని, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. భక్తులు తిరిగి తమ ఇళ్లకు సురక్షితంగా చేరే విధంగా కేరళ ప్రభుత్వ విధి విధానాలు చేపట్టాలని మంత్రి సీతక్క కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు, 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి. భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC, AITUC, TBGKS, CITU, HMS, BMS కార్మిక సంఘాలున్నాయి.





Total views : 152177