వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో కూర్చొని అందినంత దోచుకున్నారని వారు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు వెండి బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Warangal
మాదిగల ఓట్లే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరంగల్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గంపగుత్తగా మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని ఆ పార్టీ భావిస్తున్నది. రిజర్వుడ్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ.. అందులోభాగంగా మందకృష్ణను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తన బూట్లను అటెండర్ తో మోయించారు. జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి షూలతో ప్రవేశించిన కలెక్టర్.. ఆ వెంటనే తన షూలను విప్పి పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. కలెక్టర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలి వచ్చారు. అక్కడ ఉన్నవారు ఈ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 2015 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ భవేశ్ మిశ్రా ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా, అటెండర్ తో బూట్లు మోయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అయినా, అటెండర్ అయినా అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, తోటి ఉద్యోగిని ఇలా కించపరచడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు.
Read Also..
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు ఓ పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హుజూరాబాద్నుంచి పల్లెవెలుగు బస్సు హనుమకొండ వెళ్తుండగా ఎల్కతుర్తి శివార్లలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు వెనక టైర్లు రెండూ ఊడిపోయి పొల్లాలో పడిపోయాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కన ఆపారు. బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
Read Also..
Read Also..
ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి, ఎనగందుల నరేశ్ గా గుర్తించారు. ములుగు బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనం పై యూ టర్న్ తీసుకుంటుండగా ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీయంకి తరలించారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసిన మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు.
మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పివీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి నేతృత్వంలో 40 వేల కోట్లతో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందన్నారు. పివి శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పీవీ స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్ట పరచడానికి నవోదయ, గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదే అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూసంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ మహనీయుని సేవలను నిరంతరం ఇప్పటి తరానికి పాఠ్యపుస్తకాలల్లో, దృశ్యరూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.
మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి అని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకని ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలు అనంతరం దక్షిణ ద్వార స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యా వరణాన్ని పరిరక్షించి ఆధ్యా త్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనను 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కొండా సురేఖ కోరారు.
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజులపాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. కేయూలో ర్యాంగింగ్కు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్స్ సంచాలకులు, కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థుల వివరాలు సేకరించారు. పద్మావతి ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించుకున్నాక సస్పెన్షన్ వేటు వేశారు. కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థి, విద్యార్థినులు ఈ జాబితాలో ఉన్నారు.
ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినుల పై సస్పెన్షన్ వేటు. సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ , కామర్స్, ఎకనామిక్స్ , జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న సీనియర్ విద్యార్థినిలు. వర్సిటీ అధికారులకు ఫిర్యాదు. విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్ నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన వర్సిటీ అధికారులు. వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు.




Total views : 151884