వరంగల్, నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్. తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు. దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్న పోలీసులు. ఏజెన్సీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టుల దాడికి. కార్లకు నిప్పు పెట్టిన పరిస్థితి. భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలిన మావోయిస్టులు..
Warangal
హనుమకొండ, ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి. కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం. మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16). గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలింపు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలింపు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కొనసాగుతున్న నేషనల్ హైవే పనుల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి శివారులోని కాల్వపై నిర్మించిన కల్వర్టు వద్ద చుట్టూ మట్టి సరిగా పోయించలేదు. దాంతో లోడ్ తో వెళ్తున్న లారీ దిగబడింది. దీంతో అటు వైపు వెళ్తున్న లారీలు, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాదారులు, ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నపోలీసులు జెసిబి సహాయంతో లారీని బయటకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. హనుమకొండ నుండి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై కొన్నిచోట్ల కంకర వేసి వదిలి వేస్తున్నారని, దాంతో దుమ్ము ధూళి లేస్తూ ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవే పనులను ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండా తూతూ మంత్రంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుల వద్ద పోసిన మట్టిని రోడ్డు రోలర్ తో చదును చేయించి, రహదారిపై వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లడానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..
నేడు ములుగు జిల్లాకు పంచాయితీ రాజ్ & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న సీతక్క కు ఘనస్వాగతం పలికారు. ఉదయం ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోడ్డు మార్గాన ర్యాలీగా మేడారం కు చేరుకోనున్నారు. సీతక్క మధ్యాహ్నం 1:30 కు మేడారం సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం 3:00 గంటలకు మేడారం మహాజాతర ఏర్పాట్ల పై ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొనున్నారు.
Read Also..
కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాటికల్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతులు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5వ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్, బన్నీ, ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు. దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిని గమనించిన స్థానికులు రాకేష్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ 13వ తేది రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము (22) అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు. దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లోతులోకి వెళ్లిపోయాడని స్నేహితులు చెప్తున్నారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది. వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు. త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ మేరకు ఆ రూట్లో సర్వే పూర్తి చేశామని వివరించారు. కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లా ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. దీంతో ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
Read Also..
వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడారంగంలోనూ దివ్యాంగులు ముందుకెళ్తున్నారని అన్నారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లా సంక్షేమ శాఖ ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైకల్యాన్ని అధిగమించేలా దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ క్రీడలు మనలోని శక్తిని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు క్రీడా పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొంటుండడం అభినందనీయమన్నారు. ఈ నెల 15వ తేదీన హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. వేడుకలకు దివ్యాంగులు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కాగా పరుగు, షాట్ పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్, తదితర క్రీడా పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15వ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్లతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. క్రీడల్లో సమిష్టిగా సాగుతూ దానితో పాటు చదువుల్లోనూ క్రమశిక్షణ తో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్ స్పిరిట్, సాంఘిక బాధ్యత తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్, క్రీడలు బోధనలో తప్పనిసరి కావాలని టీచర్ లకు సూచించారు. విద్యార్థులు క్రీడల్లో చక్కని ప్రదర్శన చేసారు అని, కేంద్రియ విద్యాలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.




Total views : 151799