Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh పాలకొల్లులో నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

పాలకొల్లులో నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

by Satya
Nimmala Ramanaidu

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ‘పాలకొల్లు చూడు’ పేరుతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైసీపీ నేత గొడాల గోపి ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో ‘నిజం చెబుతాం’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనుమతి లేదంటూ రెండు పార్టీల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను పోలీసుల గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు,టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. అయితే పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

023118
Total views : 141011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.