Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh జగన్ పై దాడి ని ఖండిస్తూ పుత్తూరులో మంత్రి ఆర్కే రోజా నిరసన..!

జగన్ పై దాడి ని ఖండిస్తూ పుత్తూరులో మంత్రి ఆర్కే రోజా నిరసన..!

by Satya
Minister RK Roja

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy)పై జరిగిన రాయిదాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు(YCP leaders) నిరసనలకు దిగారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి ఆర్కే రోజా(Minister RK Roja) నిరసనకు దిగారు. జగన్‌‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ అనేవాడు ఉంటే మనకు డిపాజిట్లు కూడా రావని తెలిసి చంద్రబాబు నాయుడే ఈ పనికి పాల్పడ్డారని, జగన్‌పై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. ఈ ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుని వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎవరెవరితో ఈ తప్పు చేయించారో అందరి మీద కేసులు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేయాలని రోజా కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తిరుపతిలో మరోమారు నిఘా వైఫల్యం…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023207
Total views : 141481

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.