గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించామని, ఐటీ సహా అనేక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని కూటమి కూటమి విద్యార్థి విభాగం నేతలు వెల్లడించారు . ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డగించేందుకు వైసిపి కోర్టుకు వెళుతుందన్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి, వలసలను నివారించడమే కాకుండా ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు .
CVR NEWS
ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల మేర టోకరా వేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ వీసా మోసం వెలుగులోకి వచ్చింది. కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు నటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వికారాబాద్ జిల్లా యాలాల్ విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్ సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్ వారి కుటుంబ సభ్యులతో కలిసి యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానది వద్దకు సరదా కోసం వెళ్లారు. అక్కడ మోయిజ్, రహమత్లు సరదాగా ఈత కొట్టేందుకని నదిలోకి దిగారు. కొద్ది సేపటికి ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మోయిజ్ నీటిలో మునిగి మృతి చెందగా.. రహమత్ వాగులో గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోయిజ్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రహమత్ ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.
ఓ మహిళ కుళ్ళిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించిన ఘటన కామారెడ్డి పట్టణ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల భర్త రాజంతో కలిసి కామారెడ్డిలో కూలి పనికి వచ్చింది. అయితే రాజంకు పని దొరికి శ్యామలకు దొరకకపోవడంతో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్లమని చెప్పి భర్త పనిలోకి వెళ్ళాడు .తర్వాత సదరు మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి కామారెడ్డిలో వెతకగా ఆచూకీ లభించకపోవడంతో కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం టర్నింగ్ వద్ద కలెక్టరేట్ వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది మృతురాలు హత్యకు గురైందా లేక ఇతర ప్రమాదం ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ధైర్యసాహసాన్ని చూపిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో, స్పందించిన ఆ మహిళ అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది . ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం స్థానికులు మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు.”
700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్ నరసింహరావు ఆలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించి రాములవారికి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారామాల ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయా నికి రావడం తన పూర్వ జన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. 700 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం, నాటి నుండి నేటి వరకు వెలుగుతున్న అఖండ జ్యోతిని దర్శించి పులకించి పోయామన్నారు. గత రెండు సంవత్సరాలుగా గంభీరావుపేట రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నేటితో ఆ కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో ప్రజ్వలింప చేసిన జ్యోతిని తొమ్మిది రోజులు కాపాడటమే కష్టమని, అలాంటిది 7 శతాబ్దాలుగా జ్యోతిని కాపాడంలో ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు, స్థానిక ప్రజలు చూపుతున్న చొరవను ఆయన అభినందించారు. గాలిగోపుర నిర్మాణానికి తన వంతుగా 10వేల రూపాయలు విరాళంగా అందించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు కేటాయించామని, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. టెండర్ల ప్రకారమే రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో కొండవీటి వాగు, పాలవాగు పనులను పరిశీలించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే 69 వంతెనల వద్ద పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్ఆర్ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9, 10, 12, 12 లలో సీఆర్ఆర్ఐ బృందం అధ్యయనం చేసింది. తమ అధ్యయనం తర్వాత రోడ్ల నిర్మాణంలో నిపుణులు పలు సూచనలు చేశారు. త్వరలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి సీఆర్ఆర్ఐ నివేదిక ఇవ్వనుంది. మంత్రి తో సమావేశంలో సి.ఆర్.ఆర్.ఐ డైరెక్టర్ సీహెచ్ రవిశేఖర్, చీఫ్ సైంటిస్ట్ డా. కె. రవీందర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ డా. భరత్,ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్ సీహెచ్.ధనుంజయ పాల్గొన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశ్యంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని.. విషప్రచారాలను కట్టడి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో..గెలుస్తుందో ఓడుతుందో..కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా..ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో..
ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో..ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో..అదే నా రాస్తా…’ అని ఉంది. 2029లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందన్నారు. పొత్తులతో వెళతామా.. ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ఎవరు కలిసొచ్చినా రాకున్నా.. ప్రజల కోసం పోరాడతామని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తాం’ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.





Total views : 140817