Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..!

త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..!

by Satya
Lok Sabha election schedule

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్చి 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ భేటీ ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఉంటుందని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రోజుల ముందు ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షిస్తోంది.

మాజీ గవర్నర్ నివాసంలో సీబీఐ సోదాలు..!

వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో అంటే 2014లో లోక్‌సభ ఎన్నికలను తొమ్మిది దశల్లో నిర్వహించగా మార్చి 5న ఎన్నికల షెడ్యూల్‌ను, మే 16న ఫలితాలను ప్రకటించింది. 2019లో ఏడు దశల్లో నిర్వహించగా మార్చి 10న షెడ్యూల్ ప్రకటన, మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023092
Total views : 140884

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.