Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

by Rama
జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఆదివారం నాటికి దర్యాఫ్తు చేయాలని, లేదంటే సీబీఐకి అప్పగిస్తామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. లేదంటే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె డెడ్ లైన్ విధించారు.
మమతా బెనర్జీ మృతురాలి ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఈ కేసులో మరింతమంది నిందితులు ఉంటే ఆదివారంలోగా అరెస్ట్ చేస్తామన్నారు. అప్పటి లోగా రాష్ట్ర పోలీసులు కేసును ఛేదించకుంటే కేంద్ర దర్యాఫ్తు సంస్థకు అప్పగిస్తామన్నారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే సమయంలో ఆమె సీబీఐ, ఈడీలపై విమర్శలు చేశారు. సీబీఐ విజయాల రేటు తక్కువగా ఉందన్నారు. చోరీకి గురైన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023109
Total views : 140954

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.