Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

by Rama
పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ. గ‌త వారం రామ్ గోపాల్ వ‌ర్మపై ఐటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌గా.. తాను రాలేన‌ని పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తుంది. గ‌త వారం ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఐటీ చ‌ట్టం కింద రామ్ గోపాల్ వర్మపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌, నారా బ్రాహ్మాణిల‌ను కించ‌ప‌రిచేలా రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మ‌ద్దిపాడు టీడీపీ మండ‌ల ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి రామ‌లింగం ఈ కేసును పెట్టాడు. ఇక రామ‌లింగం ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసుపై విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా.. ఏపీ పోలీసులు వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్ర‌కారం మంగ‌ళ‌వారం వ‌ర్మ కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే అంత‌కంటే ముందే వ‌ర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వ‌ర్మ‌ క్యాష్ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల పిటిషన్ కొట్టివేసింది. అలాగే అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.

ఇదిలావుంటే నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచార‌ణకు హాజ‌రుకావాల్సి ఉంది వ‌ర్మ. అయితే, ఉదయం 10 గంట‌ల‌కు తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. త‌న‌పై న‌మోదైన కేసుకు సంబంధించి పోలీసుల‌కు స‌హక‌రిస్తాన‌ని చెప్పిన ఆర్జీవీ.. తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది. అనంత‌రం తాను త‌ప్పుకుండా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023104
Total views : 140915

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.