రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు.
bike accident
అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామ శివారు దుర్గమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరొకరికి గాయాలయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వీరి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది. ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో, అదుపుతప్పి కింద పడడంతో తలకి బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే వే మాడుగుల మండలం వీర నారాయణం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కడప జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి(18) సయ్యద్ కాశీం బాష (35) సయ్యద్ అబ్బు (32). అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం పాములూరులో బేల్దారి పని చేసి భోజనానికి వేంపల్లె కు వచ్చి తిరిగి పాములూరు కు వెళుతుండగా పులివెందుల – కడప బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె ఎస్ ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా.. పలాస జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై బై పాస్ రోడ్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పలాస మండలం పెద్ద నీలావతి గ్రామానికి చెందిన బొంగు.సుందరరావు (40), మిన్నారావ్ (40) గా పోలీసులు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 140840