అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రి నడిబొడ్డున ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఆర్భాటంగా అయితే ప్రారంభించి మిగతా నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేసారు.వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ దశలో ఉండంగానే ఎన్నికల కోడ్ వస్తే తమకు రావాల్సిన పేరు ఎక్కడ వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంతో కనీస వసతులు కల్పించకుండా ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకునేందుకు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు.తీరా చూస్తే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులను వదిలేసి వెళ్లారు.కేవలం మొదటి అంతస్తులో .రోగులకు సౌకర్యంగా భవనము ఉంటుందని అనుకున్నారు. అయితే గత ప్రభుత్వ వైకాపా నాయకుల అసమర్ధతతో నిర్మాణములో ఉన్న ఆసుపత్రి నాసరికంగా చెప్పట్టిన గదుల నిర్మాణ పనులు ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది.24 కోట్ల వ్యయంతో
ఆసుపత్రి భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు అయినప్పటికి తాడిపత్రి ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందలేదు.ఇందుకు వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని ప్రారంభించారు.వంద పడకల ఆసుపత్రిలో కేవలంకొన్ని గదులే వాడుతు మిగతా గదులన్నీ నిర్మాణ దశలోనే ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.రెండవ అంతస్తు,మూడవఅంతస్తు,నాలుగవంతస్తు,ఈ మూడు అంతస్తులు నిర్మాణ దశలోనే మిగిలిపోయాయి.అంతేగాక వర్షం వస్తే వర్షపు నీటితో ప్రభుత్వ ఆసుపత్రి ఒక కుంటను తలపించేలా మారింది..ఇలా అరకోర వసతులతో భవనాన్ని ప్రారంభించి ప్రజల ప్రాణాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెలగాటం ఆడరని ప్రజలు తెలిపారు.తాడిపత్రి ప్రజలకు మంచి జరగలన్నా అభివృద్ధి చేయాలన్నా ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలన్న కేవలం జేసితో మాత్రమే సాధ్యమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 150120