నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు. గృహ సముదాయాలు, విద్య సంస్థల సమీపంలో వైన్ షాపు ఎర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపు ఎదురుగా స్థానికులు డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలకు విధ్యార్థులు, విధ్యార్థినిలు వారి తల్లిదండ్రులు వస్తుంటారని దేవాలయం లాంటి విధ్యా సంస్థ ఎదురుగా అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు విధ్యార్థులు తిరిగే చోట మద్యం బాబులు మద్యం సేవిస్తూ రోడ్లు పై ఉంటే తివ్ర అంటాకం ఎర్పడుతుందన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
cvr news channel telugu
ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా సానుభూతి పరుల ఓట్లు ఫారం 7 ద్వారా తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని నారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల మాటలకు అధికారులు తలోగ్గి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన ఓటరు ఎక్కడున్నా వచ్చి ఓటు వేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈరోజు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ దేవదేవుడుని పరమేశ్వరుడిని ప్రార్థించడమైనది. అలాగే సోనియాగాంధీ కి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల మ్యానిఫెస్టోలో ఈరోజు రెండు గ్యారంటీ పథకాలను అమలులోకి తీసుకుని వస్తున్నారు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సలీం పాష, మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి పింగళి రాకేశ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టే ప్రభుదాస్, బిసి సెల్ పట్టణ అధ్యక్షులు తంగెళ్ళ క్రిష్ణా మోహన్, కాంగ్రెస్ నాయకులు పోతుల శ్రీనివాస్, యం.డి సలీం, ముద్ధమల్ల రవి, NSUI రాష్ట్ర నాయకులు పర్లపెల్లి నాగరాజు, జిల్లా St cel కార్యదర్శి మానుపాటి సూర్య చిలువేరు రాజమౌళి, మొలుగూరి సమ్మయ్య, గుర్రపు మురళి, గుర్రపు ప్రవీణ్, గుల్లీ సమ్మయ్య, చిట్యాల శంకర్, పోతిరెడ్డి మల్లయ్య, సిరిపురం కుమార్, చెంచల శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య, గడ్డం రమేష్, అకినపెల్లి మహేందర్, రాజ్‌కుమార్ , అశోక్, దొడ్డె నవీన్, పాతకాలం అనిల్, పనికెల్లా శ్రీకాంత్, మొలుగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 200 మంది నీరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 77 వ జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రజల అండతో తెలంగాణ గెలుపును బహుమతిగా ఇచ్చామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే 6 గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ భీమా 10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించడం సంతోషమన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ పుట్టినరోజును పండగ లా జరుపుకుంటున్నారన్నారు.
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారo అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
శాస్త్రవేత్తలు నక్షత్రాల నుండి వచ్చే అసాధారణంగా శక్తివంతమైన కాంతి విస్ఫోటాలను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పురోగతిని సాధించారు. ఈ విస్ఫోటాలను సూపర్ఫ్లేర్లు అని పిలుస్తారు మరియు అవి ఒక సెకనులో సూర్యుడి ఉత్పత్తి చేసే కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి.
సూపర్ఫ్లేర్లు ఎలా జరుగుతాయో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక సిద్ధాంతం అవి నక్షత్రాల కేంద్రంలోని మాగ్నెటోహైడ్రోడైనమిక్ (MHD) అస్థిరతల ద్వారా ప్రేరేపించబడతాయి. MHD అస్థిరతలు అనేవి ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు దాని చుట్టూ ఉన్న ద్రవం లేదా వాయువు మధ్య ఒక అసమతుల్యత ద్వారా ఉత్పత్తి అయ్యే అస్థిరతలు.
ఈ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, శాస్త్రవేత్తలు ఒక నమూనా నక్షత్రాన్ని ఉపయోగించి MHD అస్థిరతలను అనుకరించారు. వారు నమూనా నక్షత్రం యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్‌ను మరియు దాని చుట్టూ ఉన్న ద్రవం యొక్క లక్షణాలను సర్దుబాటు చేయడం ద్వారా, వారు వివిధ రకాల సూపర్ఫ్లేర్లను ఉత్పత్తి చేయగలిగారు.
వారి పరిశోధన ప్రకారం, MHD అస్థిరతలు నక్షత్రాల కేంద్రంలోని మాగ్నెటిక్ ఫీల్డ్‌ను బలంగా చేస్తాయి. ఈ బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ చివరికి విస్ఫోటానికి దారితీస్తుంది, ఇది నక్షత్రం నుండి భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది.
ఈ పరిశోధన సూపర్ఫ్లేర్ల యొక్క మూలం మరియు అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన దశ. ఇది ఈ అసాధారణ కాంతి విస్ఫోటాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అవి మన గెలాక్సీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
ఈ పరిశోధన యొక్క ప్రధాన రచయిత అయిన డాక్టర్ మైఖేల్ హెర్బర్ట్, “మా పరిశోధన MHD అస్థిరతలు సూపర్ఫ్లేర్లకు ఒక ముఖ్యమైన భౌతిక ప్రక్రియ అని సూచిస్తుంది,” అని చెప్పారు.
రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
రోజుకు ఎన్ని కేలరీలు తినాలి?
మనం రోజూ తినే ఆహారంలో కేలరీలు అనేది ఒక ముఖ్యమైన అంశం. మనం తీసుకునే కేలరీల సంఖ్య మనం చేసే శారీరక శ్రమకు అనుగుణంగా ఉండాలి. మనం తీసుకునే కేలరీలు మనం చేసే శారీరక శ్రమ కంటే ఎక్కువ ఉంటే, మనం బరువు పెరుగుతాము. మనం తీసుకునే కేలరీలు మనం చేసే శారీరక శ్రమ కంటే తక్కువ ఉంటే, మనం బరువు తగ్గుతాము.
రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలో ఎలా లెక్కించాలి?
రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలో లెక్కించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం, మీ వయస్సు, ఎత్తు, బరువు, లింగం మరియు శారీరక శ్రమ స్థాయిని బట్టి కేలరీల లెక్కను ఉపయోగించడం. ఈ లెక్కను ఆన్లైన్లో లేదా ఆహార శాస్త్రజ్ఞుడి నుండి పొందవచ్చు.
రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలో కొన్ని సాధారణ మార్గదర్శకాలు
- పిల్లలు మరియు యువకులు:
- 2-3 సంవత్సరాల పిల్లలు: 1,000-1,400 కేలరీలు
- 4-8 సంవత్సరాల పిల్లలు: 1,200-1,800 కేలరీలు
- 9-13 సంవత్సరాల పిల్లలు: 1,400-2,200 కేలరీలు
- 14-18 సంవత్సరాల యువకులు: 1,800-2,800 కేలరీలు
- మహిళలు:
- 19-30 సంవత్సరాల మహిళలు: 1,800-2,200 కేలరీలు
- 31-50 సంవత్సరాల మహిళలు: 1,600-2,400 కేలరీలు
- 51-70 సంవత్సరాల మహిళలు: 1,400-2,200 కేలరీలు
- 71 సంవత్సరాల పైబడిన మహిళలు: 1,200-2,000 కేలరీలు
- పురుషులు:
- 19-30 సంవత్సరాల పురుషులు: 2,200-2,800 కేలరీలు
- 31-50 సంవత్సరాల పురుషులు: 2,400-3,000 కేలరీలు
- 51-70 సంవత్సరాల పురుషులు: 2,200-2,800 కేలరీలు
- 71 సంవత్సరాల పైబడిన పురుషులు: 2,000-2,600 కేలరీలు
బరువు నిర్వహణ
బరువు నిర్వహణ అనేది మీరు మీ ఉత్తమ బరువును నిర్వహించడం. ఇది మీ ఆరోగ్యం మరియు సంక్షేమానికి ముఖ్యం. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటిలో హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, 2 రకాల మధుమేహం మరియు కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి.
బరువు నిర్వహణకు ఉత్తమ మార్గం
బరువు నిర్వహణకు ఉత్తమ మార్గం మీ ఆహారం మరియు శారీరక శ్రమను మార్చడం. మీరు మీ ఆహారంలో తక్కువ కేలరీలు తీసుకోవాలి మరియు మీరు మరింత శారీరక శ్రమ చేయాలి.
ఆహారం
మీరు బరువు నిర్వహించాలనుకుంటే, మీరు మీ ఆహారంలో తక్కువ కేలరీలు తీసుకోవాలి. మీరు తక్కువ కేలరీల ఆహారాన్ని ఎంచుకోవడానికి మీరు క్రింది చిట్కాలను ఉపయోగించవచ్చు:
- పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలను ఎంచుకోండి.
- సన్నగా ఉండే మాంసం, చేపలు లేదా కోడి మాంసం వంటి తక్కువ కొవ్వు పదార్థాలను ఎంచుకోండి.
- పాలు, పెరుగు లేదా జున్ను వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోండి.
- తయారీ చేసిన ఆహారాలు మరియు పానీయాలను నివారించండి.
శారీరక శ్రమ
మీరు బరువు నిర్వహించాలనుకుంటే, మీరు మరింత శారీరక శ్రమ చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయడం లక్ష్యంగా పెట్టుకోండి.
బరువు నిర్వహణకు ఇతర చిట్కాలు
బరువు నిర్వహణకు సహాయపడే ఇతర చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- అదనపు కేలరీలను తగ్గించడానికి, మీరు తినే ఆహారం మరియు పానీయాల పరిమాణాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.
- మీరు ఏమి తింటున్నారో మరియు ఎంత తింటున్నారో ట్రాక్ చేయడానికి లైఫ్ స్టైల్ ట్రాకర్‌ను ఉపయోగించండి.
- ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడితో బరువు కోల్పోవడానికి ఒక క్లబ్లో చేరండి.
బరువు నిర్వహణకు వైద్య సహాయం
మీరు బరువు నిర్వహణతో సమస్యలు ఎదుర్కొంటుంటే, వైద్య నిపుణుడిని సంప్రదించండి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.
Read Also..
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ కేటాయింపు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణం. దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ. సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ. ఉత్తమ్ కుమార్ కు సివిల్ సప్లై , ఇరిగేషన్ శాఖ కేటాయింపు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ , పర్యాటక శాఖ. దుదిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ , పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ. తుమ్మల నాగేశ్వరరావు కు వ్యవసాయ శాఖ, చేనేత, టెక్స్ టైల్స్. కొండ సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ. కోమటిరెడ్డికి ఆర్ అండ్ బి శాఖ, సినిమా టోగ్రఫీ.





Total views : 151068