కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
technology news
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ , పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో విడిచిపెట్టారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించటం వల్ల ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కబడ్డీ వంటి గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఈ పోటీలలో 18 రాష్ట్రాల జట్టు తలపడనున్నాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈనెల 21న ఫైనల్స్ జరగనున్నాయి.
దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు AIపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తంలో వెచ్చించడానికి సైతం వెనకాడటం లేదు. ఈ రంగంలో లక్ష మంది ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేశామని వెల్లడించింది. నిన్న రిలీజ్ అయిన TCS Q2 ఫలితాల కాన్ఫరెన్స్ లో కంపెనీ CEO & MD కృతివాసన్ ఈ మేరకు ప్రకటించారు.
‘జనరేటివ్ AI అందరి దృష్టినీ ఆకర్షించింది. మా కస్టమర్ సమ్మిట్లలో ప్రతి ఒక్కరూ ఉత్పాదక AIని కీలక థీమ్‌గా మాట్లాడుతున్నారు. కొత్త ఉత్పత్తులు, సేవల కోసం దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో.. ప్రాజెక్ట్‌లను ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి’ అని TCS CEO తెలిపారు.
ఉద్యోగులు సహా కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ‘మేము ఇప్పుడు లక్ష మంది బలమైన Gen-AI రెడీ కన్సల్టెంట్స్ మరియు ప్రాంప్ట్-ఇంజనీర్లను కలిగి ఉన్నాము. వారు ఆయా సెగ్మెంట్లలోని మా క్లయింట్ల కోసం వందలాది Gen-AI ప్రాజెక్ట్‌లను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
ఐతే టీవీ స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగిపోతుంది. కానీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగదు. మరో నిమిషం పాటూ తిరుగుతూ నెమ్మదిగా ఆగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చెయ్యగానే వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? బహుశా వేసుకొని ఉండరు. ఎందుకంటే అంత వేగంగా తిరిగేది, ఒక్కసారిగా ఆగడం కష్టమే అనే ఆలోచన మీకు ఉండొచ్చు. ఐతే దీని వెనక పనిచేస్తున్న సైంటిఫిక్ కారణం తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం ప్రతీ వస్తువూ స్థిరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. అప్పుడు దానిపై స్థితి శక్తి పనిచేస్తుంది. ఆ స్థితి నుంచి వస్తువు కదిలినప్పుడు. దానిపై గతి శక్తి పనిచేస్తుంది. అందువల్ల ఆ వస్తువు గతిశక్తితో కదలడం మొదలవుతుంది. అందువల్ల ఆ వస్తువుపై కంటిన్యూగా గతి శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలాంటి వస్తువును మనం ఆపినా వెంటనే ఆగదు. దానిపై గతి శక్తి ప్రభావం ఉంటుంది. ఐతే మనం ఆపినప్పుడు దానిపై స్థితి శక్తి ప్రభావం మొదలవుతూ క్రమంగా బలపడుతూ చివరకు గతి శక్తిని అది డామినేట్ చేస్తుంది. ఇదే విధంగా స్థితి శక్తి విషయంలోనూ జరుగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యకముందు దానిపై స్థితి శక్తి పనిచేస్తూ ఉంటుంది. స్విచ్ ఆన్ చెయ్యగానే క్రమంగా గతి శక్తి ప్రభావం పెరుగుతూ స్థితి శక్తిని డామినేట్ చేస్తుంది. అందువల్లే ఫ్యాన్ ఒక్కసారిగా స్పీడ్‌గా తిరగకుండా క్రమంగా స్పీడ్ పెంచుకుంటుంది. వస్తువు ఎంత వేగంతో కదులుతోంది అనే దాన్ని బట్టీ గతి శక్తి ప్రభావం కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్యాన్ మాత్రమే కాదు విమానం, సైకిల్, కారు, స్కూటర్, రైలు ఇలా కదిలే అన్నింటికీ వర్తిస్తుంది.
చార్జింగ్ 15 నుంచి 20 పాయింట్లు ఉన్న సమయంలోనే మనకు మొబైల్ వార్నింగ్ ఇస్తుందని, ఆ సమయంలో తప్పనిసరిగా ఫోన్‌కు త్వరగా చార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలని, మొబైల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యేంతవరకు వాడితే మాత్రం మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. బ్యాటరీ లైఫ్ టైం నాణ్యతతో పని చేయాలంటే రాత్రి పడుకునే సమయాల్లో, ఫోన్ ఫుల్ చార్జింగ్ అయిన తర్వాత కూడా అలానే ఉంచడం ద్వారా కూడా మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో చార్జింగ్ పెట్టి ఉదయం వరకు అలానే ఉంచితే బ్యాటరీపై అదనపు భారం పడి త్వరగా బ్యాటరీ ఉబ్బి కొత్త మొబైల్ అయినా సరే ఐదు నుంచి మూడు మాసాలలోనే పాడైపోతుంది. ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే చార్జింగ్ పెట్టుకుని మన నిత్యవసర పనులు, ఇంట్లో చేసుకునే సమయం వరకు చార్జింగ్ పెడితే ఫోన్ చార్జింగ్ ఫుల్ అవుతుందని, ఇది మంచి సమయం కూడా అని, ఫోన్ చార్జింగ్ ఫుల్ అయితే మనం చూసుకొని దాన్ని తీసివేయడం జరుగుతుందని తద్వారా బ్యాటరీపై భారం కూడా పడదని నిర్వాహకులు వివరించారు. ఇలా చిన్నచిన్న సలహాలు పాటిస్తే సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవకుండా రక్షించుకోవచ్చు.
ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది. నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం. నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి. 26మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా. బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.






Total views : 141396