పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలు .. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు.వీరు వేసిన అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించి హైకోర్టు తీర్పునిచ్చింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
- నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు…
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి…
- ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం…
- సింగరేణి కార్మికులకు శుభవార్త.సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141166