వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బిసి లకు అన్యాయం చేసిన వైసిపి వినుకొండలో బస్సు యాత్ర చేయడం బాధకారమన్నారు. స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో జరిగిన బస్సు యాత్ర జనాభా లేక విఫలమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయకుండా బస్సు యాత్ర చేసే మంత్రులు ఏం సమాధానం చెప్తారో తెలపాలన్నారు. రాష్ట్రంలో ఇన్ని కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా నిధులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణి వలన మంత్రులు కూడా కార్పొరేషన్ నిధులు అడగలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు రేషన్ అందజేసి ప్రజలకు లక్షల కోట్లలో డబ్బులు జమ చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టారని,
జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి 10 సంవత్సరాల నుండి బయట తిరుగుతున్నారని తెలిపారు. వరికపూడిశెల ప్రాజెక్టు నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఇప్పుడు శంకుస్థాపన చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
ycp
వైకాపా నాయకులు అవినీతి అక్రమాకేసులు ఎదుర్కొంటూ దెయ్యాలు వేదాలు వర్లిచ్చినట్టు ఉంది వైకాపా నేతల తీరు బిజెపి అధ్యక్షులు పరందేశ్వరిపై వైకాపా నాయకుల విమర్శలు పై ఆమె స్పందించారు. జగన్ వైకాపా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు అని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఇసుక అటవీ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. కరెంట్ బిల్లు చెత్త మున్సిపల్ పన్నులు వేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారు. వైకాపా నాయకులు ఇద్దరు A 1. A 2 జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ పై ఉండటం ఎక్కడా లేదు అని తెలిపారు. ఇలాంటి అవినీతిపరులు విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మీరా మా అధ్యక్షురాలు న విమర్శిస్తారా.. రాష్ట్రంలో జరిగిన మీ అవినీతిని ఆధారాలతో బయట పెట్టినందుకు మా అధ్యక్షులను విమర్శిస్తారని తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుదాం తెలిపారు.
మార్కాపురం పట్టణంలోని కంభం సెంటర్ షాది ఖానా నిర్మాణాలను స్థానిక ముస్లిం యూత్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో దివంగనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన షాది ఖానా అప్పటినుండి ఇప్పటివరకు నిర్మాణం జరుగుతూనే ఉందని ముస్లిం ప్రజలకు మాయమాటలు చెప్పి నాయకులు కాలం వెల్ల పుచ్చుతున్నారని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 2005 వ సంవత్సరం నుండి ఇంతవరకు షాది ఖానా పూర్తి చేయకుండా ముస్లింలను మోసం చేస్తూ కాలం గడిపేరే తప్ప ఎలాంటి పురోగతి లేదని అన్నారు. చేయకుండానే చేసినామని చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఇప్పటికైనా షాది ఖానా నిర్మాణం పూర్తి చెయ్యకపోతే ముస్లిం మైనార్టీ ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పడం ప్రజలని మోసం చేయడమే తప్ప మరొకటి లేదన్నారు. 18 సంవత్సరాలుగా షాది ఖానా నిర్మాణం చేపడుతున్నామని మాయ మాటలు చెబుతూ ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. షాది ఖానా కు 17 లక్షల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కాంట్రాక్టుకు బిల్లు చెల్లించలేదని, దానివల్ల నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. ఏ విధంగా షాది ఖానా పూర్తయిందని, ఎవరిని మోసం చేయడానికి చూస్తున్నారని ప్రశ్నించారు. ఆరు నెలల లోపు షాది ఖానా పూర్తి చేస్తే ముస్లిం ప్రజల ఓట్ల అడగండి లేకపోతే అడగవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అంటున్నా వైసీపీ, కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నారు. చంద్రబాబు పై వైసీపీ కేసు పెట్టింది. టీడీపీ కుడా జగన్ పై కేసు పెడితే జగన్ తట్టుకో గలరా అన్నారు. న్యాయ వ్యవస్థ ను మ్యానేజ్ చేస్తూ సిబిఐ కేసులో జగన్ 3700 వాయిదాలు తెచ్చుకున్నాడు. జగన్ వచ్చిన కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కోచ్చన్నారు. జిల్లా మొత్తం ను తక్షణమే కరువు జిల్లాగ ప్రకటించి ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీ లో టీడీపీ అధికారం చేపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.గతంలో రాజశేఖర్ రెడ్డి కొడుకని జగన్ కు ఓటు వేశారు, ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కుడా మరో రష్యా గ మారుతుందన్నారు.
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, గుండ్లపల్లి వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ. లోకేశ్వర్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే మనుషూలు దౌర్జన్యం చేయడం మానుకోవాలనీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకుల జోలికి వచ్చి దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పూతలపట్టు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు 2024లో వైయస్సార్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎవరికీ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు ప్రజలు. ప్రతి ఊరిలో రెండు మూడు వర్గాలను క్రియేట్ చేసిన ఘనత ఎమ్మెస్ బాబుది అని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇవ్వకూడదు అని ముక్త కంఠం తో ఆరోపించారు. ప్రజలను కార్యకర్తలను అనుసరించి పోకుండా విరుద్ధంగా ఇంటిపైన దౌర్జన్మలు చేయడము ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దారుణంగా ఉందని అక్కడి ప్రజలు మీడియా సమావేశంలో తెలియజేశారు.తాము ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడే నిజమైన సైనికులమని పెద్దిరెడ్డి నాయకత్వంలో మళ్లీ రాబోయే 20 ఏళ్లు జగనన్ననే సీఎం చేయటానికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.
గతంలో ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలని అలొచన రాలేదు. పేదలంటే చంద్రబాబు కు కొపం , చిరాకు. మత్స్యకారులకు తొక్క తీస్తాం , తోలుతీస్తామని అన్నారు. నాయిబ్రాహ్నణులకు తోకలు కట్ చెస్తామన్నారు. బిసిలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు. జడ్జిలు అవ్వాలంటే చంద్రబాబు కులం లొ పుట్టాలంట. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు. విద్యా , వైద్యం కార్పొరేట్ మయం చెసి బాబు తన వాళ్లకు కట్టబెట్టుకున్నారు. ఉద్దానం గోష విని , కిడ్ని జబ్బులతో చనిపోకూడదని అలోచన చెస్తున్నారు. 200 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ హాస్పటిల్ కట్టిస్తున్నారు. 700 కొట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కులాయి ద్వారా త్రాగు నీరు అందించే ఎర్పాటు చెస్తున్నారు.. కింజరాపు కుటుంబం జిల్లాకు ఏం చేసారో చెప్పాలి.. మూల పేటలో వలసల నిర్మూలనకు పొర్ట్ నిర్మిస్తున్నారు…
Read Also..
గుంటూరు సాధికారత యాత్రలో వాహాన దారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంత్రులు మాట్లాడుతుండగా సభ కి వచ్చిన వాళ్ళు తిరిగి ప్రజలు వెళ్ళిపోయారు. రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. సభ సక్సెస్ చేయాలని భావించిన వైసీపీ కి ప్రజలు తిరిగి వెళ్లడంతో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.
Read Also..
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..






Total views : 141246