Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి

ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి

by Satya
Vishnu Dev Sai

గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది. 59 ఏళ్ల విష్ణు దేవ్ 2006లో పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు శాఖ జూనియర్ మినిస్టర్‌గా పని చేశారు. కాగా, సీఎం ఎంపిక కోసం రాయపూర్‌లో ఆదివారం నాడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై విష్ణుదేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజర్యయారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీని సాధించింది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయి పోటీ చేసి గెలుపొందారు.

Advertisements

You may also like

Our Visitor

023122
Total views : 141037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.