Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె…

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె…

by Prakash
Aarogyasri Network Hospitals Strike...

శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆస్పత్రులు – ట్రస్ట్‌ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి. నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. అయితే హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

039595
Total views : 198653

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: