Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National మద్యం కుంభకోణంలో అరవింద్‌ కేజ్రీవాల్‌..

మద్యం కుంభకోణంలో అరవింద్‌ కేజ్రీవాల్‌..

by Satya
Arvind Kejriwal

మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కింగ్‌పిన్‌..

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్(South Group)’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్(South Group)’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి అని ఈడీ(ED) తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు.. కేజ్రీవాల్‌ ఓ వ్యక్తి కాదు.. సిద్ధాంతమని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు. ఆప్‌ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. అరెస్టు నేపథ్యంలో ఆయన శుక్రవారం ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకుని మాట్లాడారు. అంతకుముందు ఆప్‌ నేతలు రోడ్డెక్కారు. బీజేపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలు చేపట్టిన మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు.

ఇది చదవండి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్…


ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023113
Total views : 140971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.