Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది.

తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది.

by CVR NEWS

తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ. 20 నుండి రూ. 8కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నార పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోనుంది. ముక్కలేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే నేటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. నిరవధిక బంద్ పాటించనున్నట్లు చికెన్ దుకాణాల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్‌ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేజీకి రూ.15 నుంచి రూ.20గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కి తగ్గించటంతో తీవ్రంగా నష్టపోతున్నాంటున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: