Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Telangana తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

by CVR NEWS
ఏపీలో వేగవంతంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు , ఈఆర్ఓలు, అదనపు సీఈవోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు, ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి, వాటిని ధృవీకరిస్తారు. నకిలీ, మరణించిన మరియు చిరునామా మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మందికి పైగా బీఎల్ఓలు, దాదాపు 26 వేల మంది బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించనున్నారు. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఈ సర్వేలో సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: