Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

by CVR NEWS
జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు కలిసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాలకు ఇంటి పన్ను, నీటి పన్ను మినహాయింపు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.అంతేకాకుండా గ్రామంలోని ప్రతి వార్డు సభ్యుడు ఇంటింటికి వెళ్లి కనీసం పది మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కృషి చేయాలని నిర్ణయించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పాలకవర్గం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్యాల ఎంఈవో జయసింహారావు, పాఠశాల ఉపాధ్యాయుడు హరికృష్ణ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులను అభినందించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026909
Total views : 151344

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.