Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ”కోడికత్తి 2.0” జగన్ దాడిపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

”కోడికత్తి 2.0” జగన్ దాడిపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

by Satya
Acchennaidu's sensational comments on Jagan's attack

జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో ”కోడికత్తి 2.0(Kodikatthi 2.0)”కి తెరలేపారన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Achchennaidu). ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే అని ఆరోపించారు. డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజి నేతృత్వంలో రూపొందించిన డ్రామా అన్నారు.

ఇది చదవండి:టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం..

2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, సింగ్ నగర్ లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోని జగన్ అండ్ కో పేర్నినాని, అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని నీలి మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


Advertisements

You may also like

Our Visitor

023107
Total views : 140946

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.