Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంపై సీఎం సమీక్ష..

సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంపై సీఎం సమీక్ష..

by CVR NEWS

సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్యయం వంద‌కు వంద శాతం స‌త్పలితాలు ఇచ్చేలా ఉండాల‌న్నారు. త‌మ ప్రభుత్వం విద్యా, వైద్యం, జ‌ల వ‌న‌రుల సంర‌క్షణకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలిపారు. కంపెనీలు వీటితో పాటు త‌మ‌కు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాల‌ని సూచించారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు క‌లిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థుల‌ను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భ‌విష్యత్ అవ‌కాశాల‌ను వారు అందిపుచ్చుకునేలా త‌యారు చేయ‌గ‌ల‌మ‌ని సీఎం అన్నారు. విద్య పెట్టే వ్యయాన్ని తాము భ‌విష్యత్ త‌రాల‌పై పెట్టే పెట్టుబ‌డిగా భావిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైద‌రాబాద్ న‌గ‌రంలోనే 44 శాతం ఉన్నార‌ని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మ‌న అందరిపై ఉంద‌న్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వ‌స‌తుల‌ను వినియోగించుకుంటున్నందున త‌మ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాల‌న్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వ‌ర‌కు స‌రైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియ‌మించామ‌ని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయ‌న‌తో స‌మ‌న్వయం చేసుకొని త‌మ‌కు ఆస‌క్తి ఉన్న విద్యా, వైద్యం, జ‌లవ‌న‌రులు, నైపుణ్య శిక్షణ, వార‌స‌త్వ క‌ట్టడా ప‌రిర‌క్షణ, అడ‌వుల సంర‌క్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించ‌వచ్చని సీఎం తెలిపారు. ఇప్పటికే ర‌హేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, య‌శోద ఫౌండేష‌న్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని.. వారికి సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026347
Total views : 150270

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.