Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

by CVR NEWS
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం

రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఈ ఆసుపత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పడనుంది.

2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని ఈ రోజు పనులు ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం, అదే నందమూరి తారక రామారావు జన్మ నక్షత్రం కావడం సంతోషంగా ఉందన్నారు.హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 22న భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.అలాగే హైదరాబాద్ ఆసుపత్రిలో మరో కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని బాలకృష్ణ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027572
Total views : 152539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.