ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, అంతేగాక ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో వ్యవసాయ, ఐటీ పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు. గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే… వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. టిఎస్ పిఎస్సి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ను అమలుపరచి.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
cvr news channel telugu
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు.
తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. ఆమెకు తిరిగి పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉంటే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్ ప్రశ్నించారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
చేనేత జౌళీ రంగాలపై పునర్వైభవం కోసం అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. చేనేత పరిశ్రమలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. డిజైనింగ్, శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోచంపల్లి గద్వాల చేనేత పరిశ్రమల కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను గ్రీన్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎందుకు సంబంధించిన ప్రణాళికలపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్ లో BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను వి.సుమబాల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సెంటర్ సిఇఓ ఆయుష్ గుప్తా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఆవశ్యకత ఎంతో ఉందని, అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ బాష ను చేరువ చేసి సమాజంలో ముందుకు వెళ్లడానికి ఈ సెంటర్ ఎంతో దోహద పడుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చదువులకు నిలయమైన విజయవాడలో BAFEL అకాడమీ స్థాపించబడటం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా సంస్థ వ్యవస్థాపకురాలు అల్కా గుప్తా, ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఎడ్యుకేషన్ సీఈఓ ఎమ్ ఎల్ ఎస్ దేవ కుమార్ పాల్గొన్నారు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.
కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం కె సీతారమపురం హైవే ప్రక్కన ఎస్సీ ఏరియాలో ఇంటి వద్ద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలించే క్రమంలో స్థానికులకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు. దొంగల వద్ద స్వాధీన పరుచుకున్న ద్విచక్ర వాహనం. స్థానికులు దొంగలను హనుమాన్ జంక్షన్ పోలీసులుకు అప్ప చెప్పిన వైనం. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Total views : 140747