Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ

by Rama
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు

అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా పుష్ప 2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు . నేరుగా అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తున్నాడు అని తెలియడం తో అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు . ఈ క్రమంలోనే సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు.. ఆమె కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి . దానితో ఆ ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. మహిళ మృతిపై అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు . నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తాను . అలాగే మా మూవీ టీమ్ నుంచి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్నిస్వయంగా కలుస్తాను’ అని భరోసా ఇచ్చాడు అల్లు అర్జున్. పోలీసులు అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేయడంతో భార్య స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహారెడ్డికి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్ .ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీవర్గాలతోపాటు అభిమానులు షాకయ్యారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.
    లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. దాడుల్లో కనీసం 16 మంది మృతి చెందినట్లు…
  • భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.
    ఇక దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు. జియో నెట్వర్క్ లో ఉన్న వినియోగదారులందరినీ 2030 నాటికి పూర్తిగా 5G నెట్వర్క్ కు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో…
  • భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.
    అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై మాట్లాడిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి చెప్పింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాకిస్థాన్… ఇప్పుడు వాటి కాటుకే…
  • మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
    కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన…
  • భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం అయింది. వనమహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పలు పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా కిన్నెరసానిలో మూడు సరికొత్త సఫారీ వాహనాలను…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026501
Total views : 150551

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.