Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.

ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.

by CVR NEWS

ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు.‘‘శ్రమించేతత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం. విజన్‌-2047 ద్వారా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్‌ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరింది. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్‌ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పట్టణాభివృద్ధికి క్యూర్‌ మోడల్‌ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా. జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా.. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026826
Total views : 151173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.