Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

by CVR NEWS
ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు

హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని.. పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు. తమ చిన్నతనంలో ఇక్కడే ఆడుకునే వారిమని.. అప్పుడు చెరువు దాదాపు 15 ఎకరాల వరకు ఉండేదని… గ్రామ కాంగ్రెస్‌ నాయకుడు అర్జున్‌ తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకు పరిస్థితి బాగానే ఉండేదని… స్థానికులు పశువులను చెరువుకు తీసుకెళ్లి నీళ్లు తాగించే వారని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూవ్‌ పార్క్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత.. చెరువు వారి సొంత స్విమ్మింగ్‌ పూల్‌లా మారిపోయిందని అర్జున్‌ మండిపడుతున్నారు. తమ ఊరి చెరువును కాపాడుకునేందుకు ఎందాకైనా పోరాడుతామంటున్న కాంగ్రెస్ నేత అర్జున్‌తో మా ప్రతినిధి ప్రశాంత్‌ ఫేస్‌ టు ఫేస్..

Advertisements

You may also like

Our Visitor

027419
Total views : 152081

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.