Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh భూ సర్వేలో అవకతవకలు…

భూ సర్వేలో అవకతవకలు…

by Prakash
The survey is being done as part of the YSR Jagananna Bhu Suraksha scheme

నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో మొత్తం 2,900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3,300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో, ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా, మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలుపుతున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

026034
Total views : 149746

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.