Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh సంగం డెయిరీ డైరక్టర్ శ్రీనివాస్‌ అరెస్ట్..!

సంగం డెయిరీ డైరక్టర్ శ్రీనివాస్‌ అరెస్ట్..!

by Satya
Sangam Dairy director

గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదైంది. సంగండైరీలో పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వమని అడిగినందుకు, డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు భాదితుడు రాము ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో 3కార్లు ధ్వంసం చేసి, కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసారంటూ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026842
Total views : 151211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.