శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.decoding="async" width="150" height="150" src="https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-150x150.webp" class="attachment-thumbnail size-thumbnail wp-post-image" alt="కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి" style="" srcset="https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-150x150.webp 150w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-25x25.webp 25w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-300x300.webp 300w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-90x90.webp 90w, https://cvrnews.net/wp-content/uploads/2026/06/Vinakaya-585x585.webp 585w" sizes="(max-width: 150px) 100vw, 150px" title="కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. 6cvrnews%">
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల…


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…






Total views : 141967