తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను, డిఆర్ సి సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పరిశీలించారు. గోషామహల్ నియోజకవర్గ డిఆర్ సి సెంటర్ కోటి మహిళ కాలేజీ లో.. బహదూర్ పూర నియోజక వర్గం డిఆర్ సి సెంటర్ అరోరా లీగల్ అకాడమీలో పరిశీలించిన తర్వాత.. సెక్టార్ అధికారులు, పోలింగ్ అధికారులకు, సిబ్బందికి పాటించవలసిన ఎన్నికల నిభందనలను వివరించారు. అదే విధంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిఆర్ సి సెంటర్ ను సైతం పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛననీయ సంఘటనలు జరగకుండా పగడ్భందీగా ఏర్పాట్లు చేశామని రోనాల్ట్ రాస్ అన్నారు.
తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం…
328
previous post





Total views : 152500