Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National బస్సులో బాలిక పై గ్యాంగ్ రేప్

బస్సులో బాలిక పై గ్యాంగ్ రేప్

by Satya
Gang rape of girl in bus

2012 నాటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో రాజస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫూల్‌చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు రాత్రి సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లో కూర్చుంది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్‌చంద్ మీనా వివరించారు.

Advertisements

You may also like

Our Visitor

008569
Total views : 56858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.