Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

by Rama
పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయం, భావప్రకటన, ఐకమత్యానికి రాజ్యాంగం సురక్షా కవచ్ లా పనిచేస్తోందన్నారు. అయితే గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పేవాళ్లు దాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ పేరును ప్రస్తావించకుండానే.. ఒక్కరికి ప్రయోజనం చేసేందుకు 142 కోట్ల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు, వనరులు, డబ్బులు కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయన్నారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైన్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఒక్కరి చేతిలో పెట్టారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ, రిజర్వేషన్ కోటాలను నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయ సూత్రాలను బీజేపీ అణగదొక్కుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వచ్చి ఉంటే ఇప్పటికే వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించి ఉండేవారని ఆరోపించారు. గెలిచినా ఓడినంత పని కావడంతో రాజ్యాంగ మార్పు ఈ దేశంలో సాధ్యం కాదని బీజేపీకి అర్థమైందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ అంటుంటే బీజేపీ మాత్రం తమ వైఖరిని దాటవేస్తోందన్నారు. కులగణన గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే వారు మాత్రం మంగళసూత్రాన్ని అపహరించుకుపోతారని అంటున్నారని ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023024
Total views : 140751

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.