Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home National సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

by Satya
ubrata Roy

సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

027089
Total views : 151556

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.