Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

by Prakash
mla marri janareddy

ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వెంకటాపూర్ గగ్గల పళ్లి గ్రామాలలో మర్రి జనార్దన్ రెడ్డి నేడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మర్రి జనార్దన్ రెడ్డి వెంట నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి లు పాల్గొన్నారు. ప్రచారానికి గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. గగ్గలపల్లి గ్రామంలో శివాలయంలో పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్న మర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం పై ప్రసంగించారు. కారు గుర్తుకే ఓటు వేసి, రైతు సంక్షేమ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ప్రేమను ఆయన ఓటర్లకు తెలియజేశారు. మంగళవారం నుండి రైతుబంధు పైసలు టింగ్ టింగ్ అంటూ రైతుల ఖాతాలోకి వస్తాయని ఓటర్లకు తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించిన బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కారు కోరారు . కారు గుర్తుకే ఈ నెల 30న ఓటు వేయాలని అందర్నీ మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు . మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారానికి ఆయన వెంట ర్యాలీగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్వరలో నాగర్ కర్నూల్ జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలను కూడా తీసుకు వస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

026628
Total views : 150780

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.