Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana రూ.500 గ్యాస్ పథకానికి కొత్త మలుపు

రూ.500 గ్యాస్ పథకానికి కొత్త మలుపు

by Satya
new twist to the Rs.500 gas scheme


నగదు బదిలీ:

మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని తెలంగాణా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్‌ ధర 955 రూపాయలుగా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది.

పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం..!

తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది. అయితే కొత్తగా తీసుకునే గ్యాస్‌ కనెక్షన్లకు 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహారభద్రత కార్డులున్నవారికీ.. అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే గ్యాస్‌ సబ్సిడీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. గృహ వినియోగదారుడు గడిచిన మూడేళ్లలో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారుల గుర్తించామని అధికారులు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు …
అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం …

Advertisements

You may also like

Our Visitor

027060
Total views : 151519

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.