Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News ఆయనను అరెస్ట్ చేస్తేనే ఎన్నికల్లో బీజేపీ గెలిచేది…

ఆయనను అరెస్ట్ చేస్తేనే ఎన్నికల్లో బీజేపీ గెలిచేది…

by Prakash
D. Ravindra Naik

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, లక్షల కోట్ల అవినీతిపై ఇటీవల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపించి అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్, కేంద్ర విజిలెన్స్ శాఖ మంత్రికి మెమోరాండం అందజేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ తెలిపారు.

హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అరెస్ట్ కు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని… ఇప్పటికైనా ఆయనను అరెస్టు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశం ఉందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానా, ప్రజల డబ్బు, వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. అసైన్డ్, మిగులు, వక్ఫ్, దేవాలయం, శరణార్థులు, గౌథాన్, భూదాన్, నయీం, మియాపూర్, ఈడీ భూములను క్విడ్-ప్రో ప్రాతిపదికన, తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాగ్ నివేదిక, వార్తా పత్రికలు నిరంతరం స్పష్టమైన పత్రాలతో బహిర్గతం చేస్తున్నాయన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027145
Total views : 151624

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.