ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్థి(JanaSena Candidate) చిర్రి బాలరాజు(Chirri Balaraju) నామినేషన్(Nomination) వేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్(Putta Mahesh Yadav) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం నుండి భారీ ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ.. బుట్టాయిగూడెం మండలం కోట రామ చంద్రపురం ఐటీడీఏకు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి, ఐటీడీఏ పీవో సూర్య తేజకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం పుట్టా మహేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 202969