హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగిన నేపథ్యంలో సీఎం రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేయగా.. తాజాగా సీఎం సుఖ్వీందర్సింగ్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు. దీంతో మరో సీఎం అభ్యర్థిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఉదయం అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు.
congress
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 8వ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం అయింది. ముఖ్య అతిధితులుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, బంగారు శృతి పాల్గొన్నారు. సోమశిల, సింగోటం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్, కోడెర్, పెద్దకొత్తపల్లి మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. విజయ సంకల్ప యాత్ర నరేంద్రమోదీని మూడోవసారి ప్రధాని చేయడం లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ విజయం లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పది సంవత్సరాలలో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, సహసాపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తొడు దొంగలు, బీజేపీ ఎప్పటికి బిఆర్ఎస్ తో కలవదు అన్నారు. యూపీఐ కుంభకోణాలకు నిలయం అన్నారు. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితి లేదని విమర్శించారు. పల్లెలు, పట్టణాలలో, నగరాలలో విజయ సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్రమోదీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇది చదవండి: యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం
రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని సోనియా పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
చిరిగిన బీజేపీ, కాంగ్రెస్ ప్లెక్సీలు…
పార్లమెంట్ ఎన్నికలకు మేము రెడీ అనే అర్ధం వచ్చేటట్లు “సిద్ధం” పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ పార్టీకి (BJP) చెందిన ఎంపీ అరవింద్ వ్యతిరేకవర్గం నాయకులు చించి వేశారు. ఒకరికి ఒకరు కౌంటర్ ఇస్తున్నట్లుగా ఇద్దరు కీలక నేతల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే కారణంతోనే చించి వేసినట్లు బీజేపీ లీడర్లు తెలిపారు.
Follow us on :Facebook, Instagram&YouTube.
బీజేపీ – కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ యుద్ధం(Flexi War)…
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఫ్లెక్సీ చించిన వారితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కాస్త కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వరకు చేరినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫ్లెక్సీ వివాదం ఎటువైపుకు దారితీస్తుందో అన్నది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas):
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన కావాలని-రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంగట్టారని అన్నారు. 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు, ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.by CVR NEWSప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.by CVR NEWSఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.by CVR NEWSఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మునుగోడు (Munugodu):
పార్లమెంటు ఎన్నికల దృశ్య వివిధ పార్టీల నుండి చేరికలు చేసుకోవచ్చని అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16వ తేదీన ఎఐసిసి ఇంచార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో గత ఎన్నికల్లో మునుగోడు బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరడం జరిగిందని సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు రావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం అంతటితో ఆగకుండా చలమల కృష్ణారెడ్డి శనివారం రోజు చౌటుప్పల్ మండలం దామేర గ్రామంలో తన క్యాంప్ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ పలు మండలాల ముఖ్య నేతలను, కార్యకర్తలనతో ముఖ్య సమావేశం నిర్వహించి తాను రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది.
రథసప్తమి రోజు మంచి రోజు కావడం తో జాయిన్ అయ్యానని తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తను బీజేపీ పార్టీలో ఉన్న తన మనసు కాంగ్రెస్ పార్టీ లో వున్నదని, మరో రెండు రోజుల్లో ఐదు వేల మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్‌లో మరోసారి జాయిన్ అయితా అని తెలుపుతూ, స్థానిక ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేయడం తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పార్టీ ఎవరికి ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తామని తెలపడంతో పాటు పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఎంపీగా కూడా ఉంటానని తెలిపారు.
Follow us on :Facebook, Instagram& YouTube.
దీనిని ఖండిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని తాను మాత్రమే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గా తెలపలేదని తాను గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోరుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో చేరుతున్నట్టు చేరానంటూ చెప్పుకుంటున్నాడని దీన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.
చలమల కృష్ణారెడ్డి చేరికపై ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పలు మండలాల సోషల్ మీడియా గ్రూపులలో ఒకరి పై ఒకరు చర్చించుకుంటున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు చలమల కృష్ణారెడ్డి చేరిక ను ఉద్దేశించి మాట్లాడకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో సగటు కార్యకర్త ఈ గ్రూపు రాజకీయాలు ఏందీ అని మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు. దీనిపై పూర్తి అవగాహన రావాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టమైన అవగాహన వస్తుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. Read Also..
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.by CVR NEWSడ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
- స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..by CVR NEWSదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.by CVR NEWSసీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project):
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను దారి మళ్లిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యముందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిన విషయాన్న గుర్తు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కాళేశ్వరం సందర్శించి వచ్చారన్నారు. అయినప్పటికీ మళ్లీ కాళేశ్వరం సందర్శన, విచారణ పేరుతో ఈ డ్రామాలేందని నిలదీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ప్రజాహిత తొలిదశ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.. ఏమన్నారంటే…
బండి సంజయ్ వ్యాఖ్యలు:
కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రజాహిత యాత్ర తొలిదశ యాత్రను ప్రారంభించాం. ఈరోజు అగ్రహారం వద్ద ముగించాను. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాహిత యాత్రను కొనసాగించాను. ఎక్కడికి పోయినా మోదీ గురించి మాట్లాడుతున్నారు. దేశానికి మోదీ చేసిన సేవలను చెబుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజాహిత యాత్రను ఆశీర్వదించారు. ఈ యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నా పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి, ముఖ్యంగా ప్రధానంగా 7 సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామ గ్రామాన వివరించాను.
ఈ ఒక్క సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయల నిధులిచ్చాం. అంత పెద్ద ఎత్తున నిధులు మోదీ ప్రభుత్వం ఇస్తుందని తెలుసుకుని ప్రజలే ఆశ్చర్యపోయారు. కేంద్రం నయాపైసా ఇయ్యలేదు.. అభివ్రుద్ధి నిధులన్నీ రాష్ట్రానివేనని కేసీఆర్, కేటీఆర్ ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదేనని ప్రజలు గ్రహించారు. బీఆర్ఎస్ మూర్ఖులు కూడా వాస్తవాలు గ్రహించాలి. దేశంతో రాష్ట్రానికి కూడా కేంద్రం నిధులిస్తోంది.. కొత్తేముందని ఇప్పుడు చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో గ్రామాల అభివ్రుద్ధికి, ఇండ్ల కోసం మంజూరు చేసిన నిధులను ఎందుకు దారి మళ్లించారో సమాధానం చెప్పాలి. 14, 15 ఆర్దిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగింది. మొక్కల పెంపకం కోసం ఇచ్చిన వందల కోట్ల నిధులను దోచుకుతిన్నారు… ఇదేమని ప్రశ్నిస్తే… జవాబు చెప్పలేక నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.మేం గ్రామాలకిచ్చిన నిధులపై పోస్టర్లు వేస్తే తప్పేంది? స్వయం ప్రకటిత మేధావి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. మేం పోస్టర్లు వేస్తే మీరు మెడలో బోర్డులు వేసుకుని తిరుగు.. ఎవరు వద్దన్నారు? నన్ను గెలికితే ఊరుకునే ప్రసక్తే లేదు. గచ్చిబౌలిలో రూ.600 కోట్ల విలువ చేసే భూదాన భూములను ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, బోయినిపల్లి మండలంలోని నర్సింగాపూర్ లో 20 ఎకరాల సింగిల్ బిట్ ఎట్లా కొన్నారో అన్నీ బయటపెట్టాల్సి వస్తది.
Follow us on : Facebook, Instagram & YouTube.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం, క్రిష్ణా నది నీళ్లపై అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతున్నయ్. ప్రజలకిచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ చేసిన మోసాలను బయటకు రాకుండా ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నరు. కాళేశ్వరం విషయానికొస్తే….నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శించి గత అక్టోబర్ లో సందర్శించింది. 20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నవంబర్ 1న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) పై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో ఏముందంటే…(నివేదిక కాపీనీ చూపిస్తూ…) ‘‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంచింది. ఇది ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు.’’ అని నివేదికలో పేర్కొన్నారు.
’’బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్య మరమ్మతు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుండి తొలగించి మళ్లీ పునర్ నిర్మించాల్సిందే. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే… మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలి.అంతవరకు రిజర్వాయర్ లో నీటిని నింపకూడదు. పెడచెవిన పెట్టి నీటిని నింపితే పైపింగ్ సమస్య ఏర్పడి ప్రజలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరంలో ప్రాజెక్టు (Kaleswaram Project) లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.by CVR NEWSడ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
- స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..by CVR NEWSదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.by CVR NEWSసీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్… బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు. మరోవైపు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.
కమలం పువ్వు గుర్తు (BJP)కు ఓటేస్తే రాముడికి వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల 5 వందల ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్రుందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బ్రందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తరువాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం, క్రిష్ణా నీటి పంపకాల పేరుతో పరస్పరం దూషించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని మాట ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
హిందువుల 5 వందల సంవత్సరాల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిర నిర్మాణమని, ఆ కలను నెరవేర్చిన నరేంద్రమోదీ మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టిక్కెట్ కోసం కన్నకొడుకు పేరునే మార్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని ఎన్టీఆర్ పేరు పెట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్న మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 141438