కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్…. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
- నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు…
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి…
- ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141170