Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra PradeshKadapa స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

by Rama
vykuntha ekadasi

జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

027393
Total views : 152009

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.