ఏపిలోఅధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ (Dialogue war) ఊపందుకుంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కూటమిపై సెటైర్ల పేల్చారు. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించే మోసగాడని అన్నారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని.. రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. సీఎం జగన్ ఎవరికీ తలవంచే వ్యక్తి కాదని.. ఎంతటి వారినైనా ఎదర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అభివర్ణించారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత తమకే దక్కుతుందని అంబటి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బంగారం కోసం సొంత అవ్వనే చంపిన మనవుడు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి