Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Political పాతబస్తీలో భారీగా పట్టుబడిన గంజాయి..

పాతబస్తీలో భారీగా పట్టుబడిన గంజాయి..

by Rama
Ganjayi

ఇద్దరు మహిళలతో పాటు గంజాయి ని స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు. పరారీలో ప్రధాన నిందితుడు. మంగళవారం ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ భయ్యా లాల్ నగర్ లో నివసించే పద్మ కుమారుడు శ్రీనివాస్ చారి చెడు సవాసాలకు బానిస కావడంతో కొన్నాళ్ల క్రితం తలిదండ్రులు శ్రీనివాస్ చారి ని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చారి సంతోష్ నగర్లో ఓ అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాడు. తరుచూ ఆంద్రప్రదేశ్ మచిలీపట్నం వెళ్లి వచ్చే వాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆశ తో గంజాయి దందాలో దిగాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్ తీసుకువచ్చి యువతను టార్గెట్ చేసి విక్రయిస్తున్నాడు.

ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గంజాయి కావాలని శ్రీనివాస్ కు పరిచయం ఉన్న ఓ స్నేహితుడు కోరడంతో పాతబస్తీలో భయ్యా లాల్ నగర్ లో ఉండే తలిదండ్రుల ఇంటికి రావాల్సిందిగా స్నేహితుడికి శ్రీనివాస్ చారి సూచించాడు. అనంతరం 14 కేజీల గంజాయి తీసుకుని భయ్యా లాల్ నగర్ లో ఇంటికి శ్రీనివాస్ చారి చేరుకున్నాడు. ఇంట్లో గంజాయి పెట్టి మాట్లాడగా ఓ వ్యక్తి SOT పోలీసులకు విశ్వసనీ సమాచారం అందించాడు. వెంటనే శంషాబాద్ SOT పోలీసులు ఇంటిపై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన శ్రీనివాస్ చారి ఇంటిపై నుంచి కిందకు దూకి పారిపోయాడు. శ్రీనివాస్ చారికి ఆశ్రయం ఇచ్చిన తల్లి తో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకుకుని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.

ఇది చదవండి: పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

027427
Total views : 152094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.