ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.
ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్టణం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచినవారే. అభ్యర్థిని పోటీకి నిలిపితే గెలిపిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ముందుకొచ్చినప్పటికీ అంత ప్రయాస అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సైదులు , నరసయ్య గా పోలీసులు…
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
- స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141179