Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana మోహన్ బాబు ఫ్యామిలీ గొడవపై స్పందించిన రాచకొండ పీసీ

మోహన్ బాబు ఫ్యామిలీ గొడవపై స్పందించిన రాచకొండ పీసీ

by Rama
మోహన్ బాబు ఫ్యామిలీ గొడవపై స్పందించిన రాచకొండ పీసీ

సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని… అయితే వాళ్ల వల్ల పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదని చెప్పారు. జల్ పల్లిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందువల్లే ముగ్గురికీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇకపై మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండటానికి వీల్లేదని సుధీర్ బాబు చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీసులకు సూచించామని తెలిపారు. తమ నోటీసులకు స్పందించి తమ ఎదుట మనోజ్ హాజరయ్యారని చెప్పారు. మనోజ్ ను సంవత్సరం పాటు బైండోవర్ చేస్తూ ఆదేశాలిచ్చామని తెలిపారు. బైండోవర్ నోటీసుకు కొంత సమయం కావాలని విష్ణు కోరారని… ఈ నెల 24వ తేదీ వరకు ఆయనకు సమయం ఇచ్చామని వెల్లడించారు. మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు మేనేజర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
    రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు…
  • నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
    నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సైదులు , నరసయ్య గా పోలీసులు…
  • వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
    డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
  • స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
    దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
  • ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
    సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.