Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home TelanganaHyderabad వైసీపీ నేత బుట్టా రేణుక ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ

వైసీపీ నేత బుట్టా రేణుక ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ

by Rama
butta-renuka

వైసీపీ నేత బుట్టా రేణుక (Butta renuka) భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ సిద్ధమవడం సంచలనంగా మారింది. మే 6న ఈ-వేలం వేయనున్నట్టు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రకటన విడుదల చేసింది.

వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణం తీసుకున్నారు. కొవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వాటిని మూసేయాల్సి వచ్చింది. ఇది బుట్టా ఇన్‌ఫ్రాతో పాటూ ఇతర సంస్థలపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది.

అయితే, బకాయి చెల్లింపుల అంశం ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ పరిశీలనలో ఉన్నా ఎల్‌ఐసీ వేలం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక దంపతులు పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. బుట్టా రేణుక ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తలపడుతున్న విషయం తెలిసిందే.

ఇది చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు


ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు …
అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026628
Total views : 150780

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.